సాక్షి, తాడేపల్లి : కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదివారం రోజున అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనల వల్లనే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలు, లబ్ధిదారుల, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకం అని పేర్కొన్నారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు.
కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పరిస్థితి మారాలని అన్నారు. పరిపాలనలో తనకు జిల్లా కలెక్టర్లే కళ్లు, చెవులు అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి కలెక్టర్లే వారధి వంటివారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment