
సాక్షి, రంగారెడ్డి: పంచాయతీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సర్పంచులు, ఒక పంచాయతీ అధికారిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేౠరు. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని పేర్కొంటూ మొయినాబాద్ మండలంలోని తోల్‌కట్ట గ్రామ సర్పంచ్ కనక మామిడి శ్రీనివాస్, కేతిరెడ్డి పల్లి సర్పంచ్ ఎన్.హరీశ్ చంద్‌ను సస్పెండ్ చేశారు. వీరితోపాటు శంకర్ పల్లి మండలంలోని మొకీల గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ తులసిపైనా కలెక్టర్ అమోయ్ కుమార్ వేటువేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సరిగ్గా అమలు చేయక పోవడం, అభివృద్ధిలో వెనుకబడ్డందుకు బాద్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment