
మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- హరితహారం సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో హరితహారంపై వ్యవసాయం, అటవీ, ఎక్సైజ్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖలకు ఎన్ని మొక్కలు నాటాలో ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు అధికారులందరూ సమన్వయంతో కషి చేయాలన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగువందల మొక్కలకు ఒక వన సేవకుడి నియమించనున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణ, వాటి తీరుతెన్నుల వివరాలను తెలుసుకునేందుకు ప్రతినెలా నివేదికలను అందజేయాలన్నారు. ఎన్నెస్పీ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా అభివద్ధి చేసిన చెరువుగట్లపై ఈతచెట్లు పెంచేందుకు గాను జిల్లాలకు ఏడు లక్షల విత్తనాలను ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలిపారు. ప్రజలు గహాలలో పండ్లమొక్కలను వేసుకోవడానికి, వారు కోరిన వాటిని పంపిణీ చేయాలన్నారు. అటవీ భూముల్లో సామాజిక వనవిభాగం ద్వారా మొక్కలను నాటాలన్నారు. ఈ సమావేశంలో జేసీ దేవరాజన్‌దివ్య, అటవీశాఖ అధికారి నర్సయ్య, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ మణిమాల, ఎక్సైజ్ డీసీ మహేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.