‘హరితహారం’ విజయవంతం చేయండి
నవాబుపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మూలమాడలో మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమే హరితహారం కార్యక్రమమన్నారు. మొక్కలు విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పోలీస్ రాంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ సుభాన్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ డెక్క మాణెయ్య, నాయకులు రాములు, మోహన్‌రెడ్డి, నరెందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
Published Tue, Jul 26 2016 4:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement