చిలకూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారాన్ని ప్రారంభించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో కేసీఆర్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిలుకూరులో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడమే హరితహారం లక్ష్యమని చెప్పారు. వన సంపద చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
Published Fri, Jul 3 2015 4:27 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement