మొక్కే కదా అని పీకేస్తే.. కేసే! | Case filed Against the Person who Removed the Plant in Siddipet | Sakshi
Sakshi News home page

మొక్కే కదా అని పీకేస్తే.. కేసే!

Published Fri, Aug 9 2019 4:31 PM | Last Updated on Fri, Aug 9 2019 4:33 PM

Case filed Against the Person who Removed the Plant in Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: హరితహారంలో భాగంగా నాటిన మొక్కను ఓ దుకాణ యజమాని తొలగించడంతో అతనిపై  సిద్ధిపేట వన్‌టౌన్‌ ఠాణాలో గురువారం కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోహినిపురా వెంకటేశ్వరాలయం సమీపంలో ఓ చెప్పుల దుకాణం ఎదుట నాలుగు రోజుల క్రితం స్థానిక కౌన్సిలర్‌, అధికారులు హరితహారంలో భాగంగా వేప మొక్కలు నాటారు. ఈ నెల 7న రాత్రి అక్కడి దుకాణం యజమాని ఉమేశ్‌ మొక్కను తొలగించాడు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఘటన వెలుగుచూడడంతో పట్టణ ఉద్యాన శాఖాధికారి ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement