రెండున్నర ఏళ్లలోనే అభివృద్ధి | two and of years more development | Sakshi
Sakshi News home page

రెండున్నర ఏళ్లలోనే అభివృద్ధి

Published Sat, Aug 6 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

ఖానాపూర్‌ సభలో ఉపాధిహామీ సిబ్బందిని ప్రశ్నిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ఖానాపూర్‌ సభలో ఉపాధిహామీ సిబ్బందిని ప్రశ్నిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

70ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలో చేసి బంగారు తెలంగాణ దిశలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్,Sకర్కాస్‌తండా ప్రాథమిక పాఠశాలల్లో మొక్కలు నాటారు. అనంతరం ఖానాపూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన

 మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం
తలకొండపల్లి : 70ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలో చేసి బంగారు తెలంగాణ దిశలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్,Sకర్కాస్‌తండా ప్రాథమిక పాఠశాలల్లో మొక్కలు నాటారు. అనంతరం ఖానాపూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 250గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 1,700ఎకరాలను పంపిణీ చేశామన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్‌నాటికి కేఎల్‌ఐ ద్వారా 62వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే పాలమూర్‌–రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టి బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి నుంచి ఖానాపూర్‌ మీదుగా మెదక్‌పల్లి వరకు, పెద్దూర్‌ నుంచి తలకొండపల్లి వరకు బీటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.
 
ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎక్కడ? (సెపరేట్‌ బాక్స్‌లో ఇవ్వండి)
కాగా, ఖానాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గత ఏడాది ఉపాధిహామీ పథకం ద్వారా ఎంత ఖర్చు చేశారు, ఎన్ని పని దినాలు కల్పించారు, జాబ్‌ కార్డులు ఎన్ని, గ్రామంలో ఇళ్లు ఎన్ని?.. అని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ఏ) వెంకటేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. 440జాబ్‌ కార్డులకు వందరోజుల పనిదినాలు కల్పిస్తే సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 12శాతం మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. మొక్కలు నాటకపోయినా, ఉపాధిహామీ పనులు చేపట్టకపోయినా ఎఫ్‌ఏతోపాటు టీఏ, ఏపీఓ, ఏంపీడీఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సరిగా పనిచేయని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నర్సింహ, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు లక్ష్మీదేవీరఘరాం, రాజశేఖర్‌; ఆయా గ్రామ సర్పంచ్‌లు అంజనమ్మ, మణెమ్మ, ఉపసర్పంచ్‌లు కరుణాకర్‌రెడ్డి, యాదయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement