ప్రతీ మొక్కను సంరక్షించాలి | save tree plants | Sakshi
Sakshi News home page

ప్రతీ మొక్కను సంరక్షించాలి

Published Sat, Jul 23 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మొక్కలు నాటుతున్న మంత్రి, ఎమ్మెల్యే, పీవో

మొక్కలు నాటుతున్న మంత్రి, ఎమ్మెల్యే, పీవో

  • అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్న
  • మెుక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యే, పీవో
  • ఇంద్రవెల్లి : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి మండలంలోని ముత్నూర్‌ గ్రామ సమీపంలో ఉన్న త్రివేణి సంఘం చెరువు కట్టపై మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించి చెట్లు లేకపోవడంతో వర్షాలు సరిగా పడక పర్యావరణం కలుషితమవుతోందని తెలిపారు.
     
    ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఉట్నూర్‌ ఆర్డీవో ఐలయ్య, ఎంపీపీ జాదవ్‌ మీరాబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు దేవ్‌పూజే సంగీత, ముత్నూర్‌ సర్పంచ్‌ తుమ్రం తారమతి, తహసీల్దార్‌ ఆజ్మీర శంకర్‌నాయక్, ఎంపీడీవో బానోత్‌ దత్తారాం, ఎఫ్‌ఆర్‌వో శివకుమార్, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సుపీయన్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    రాథోడ్‌ కలప తరలించారు.. మేము మొక్కలు నాటుతున్నాం
    మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ అక్రమంగా కలప తరలిస్తే.. అడవిని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి రామన్న విమర్శించారు. అటవీ సంపదను తరలించిన ఆయనకు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు.  
     
    మార్కెట్‌ కమిటీ ఏడీపై మంత్రి ఆగ్రహం
    జన్నారం : ‘మార్కెట్‌ యార్డు ఆవరణలో మెుక్కలు నాటేందుకు వచ్చిన విద్యార్థులతో మెుక్కలు ఎందుకు నాటించలేదు.. హరితహారం అంటే తమాషాలా అనిపిస్తుందా..’ అంటూ మంత్రి రామన్న జన్నారం మార్కెట్‌ కమిటీ ఏడీ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే విద్యార్థులతో మెుక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, డీఎఫ్‌వో రవీందర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీటీసీ సభ్యులు జ్యోత్సS్న, సుమలత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అక్కపెల్లి, వైస్‌ చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement