minister ramanna
-
చదువే ఆయుధం
మంత్రి జోగు రామన్న బేలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం బేల : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులందరికీ చదువే ఆయుధమని, దీన్ని గుర్తించి ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులు చదివించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురం భీం చౌరస్తా, స్థానిక బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని తెలిపారు. గిరిజన సంఘాలు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకునేలా చైతన్యం చేయాలని అన్నారు. ఈ నెలాఖరు వరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రుణాలు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమయ్యేలా చూస్తానని తెలిపారు. ఈ నెల 17నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఐటీడీఏ ఉట్నూర్ నుంచి ఒక ప్రత్యేక అధికారి ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నైతం బాలు మాట్లాడుతూ 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు స్థానిక అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మస్కే తేజ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, ఎంపీటీసీ సభ్యుడు కొడప అరుణ్, మండల కో–ఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యదర్శి పెందుర్ రాందాస్, తదితరులు పాల్గొన్నారు. -
నాటకుండా పడేస్తారా?
మొక్కలపై నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవు మంత్రి జోగు రామన్న హెచ్చరిక జన్నారం : హరితహారం గురించి రాష్ట్రమంతా కలిసి సాగుతుంటే తెచ్చిన మొక్కలను నాటకుండా పడేస్తారా.. గత పది రోజుల క్రితం నేను వచ్చి నాటినప్పుడు పడేసిన మొక్కలు ఇప్పటికీ అలాగే ఉంచుతారా..ఏం తమాషా చేస్తున్నారా... నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు అని అటవీశాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. పది రోజుల క్రితం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం 800 మొక్కలు తీసుకువచ్చారు. విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు మొక్కలు నాటారు. మంత్రి వెళ్లిపోయిన మరుక్షణమే మొక్కలను గుంతల వద్దే వదిలేసి వెళ్లారు. శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేయగా ఎక్కడి మొక్కలు అక్కడే పడేసి ఉన్నాయి. కొన్ని మొక్కలు చనిపోయాయి. వాటిని చూసిన మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న వారెవ్వరు అని పిలువగా సెక్యురిటీ గార్డులు వచ్చారు. మొక్కలపై ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అధికారులు ఎక్కడున్నారని ఆరా తీశారు. తహశీల్దార్ రావాల్సిందిగా కోరడంతో అందుబాటులో లేరు. దీంతో పడేసిన మొక్కలను ఆయన తీసి పక్కన పెట్టారు. మొక్కలు దొరక్కా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడ తెచ్చిన మొక్కలను నాటకుండా తమాషా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్‌ను ఆదేశించారు. -
రోడ్ల అభివృద్ధికి రూ.1,700 కోట్లు
తక్షణ సహాయంగా రూ.లక్ష మంత్రి జోగు రామన్న డయేరియా మృతుల కుటుంబానికి పరామర్శ నార్నూర్ : జిల్లాలోరూ.1,700 కోట్లతో పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని మేడిగూడ గ్రామంలో డయేరియాతో మృతిచెందిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుడు నాగనాథ్ భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబ పోషణ కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. మంత్రిని నిలదీసిన మహిళలు మేడిగూడకు చెందిన దివ్య, మాధవిలు మంత్రి రామన్నను నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చి 63 ఏళ్లు అవుతున్నా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టక పోవడంతోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు పోయాయని, పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా ప్రశ్నించారు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మాట్లాడుతూ రూ.2 కోట్లతో గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. గ్రామంలో తాగునీటి వసతి కోసం వాటర్‌ట్యాంకు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి కుమారులను మంచి పాఠశాలలో చేర్పించి విద్యనందిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, సర్పంచ్ దయానంద్‌నాయక్, రఘుపతి, ఐటీడీఏ పీవో కర్ణన్, ఆర్డివో ఐలయ్య, జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అటవీ మంత్రా.. మజాకా..!
ఆకస్మిక తనిఖీ భోరజ్–సిర్సన్నలో మొక్కలను పరిశీలన.. నిర్లక్ష్యం వీడాలని అధికారులకు క్లాస్ జైనథ్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం అధికారులను హడలెత్తించారు. ఆయన ఆకస్మికంగా మండలంలోని భోరజ్–సిర్సన్న పీఆర్ రోడ్డు వెంట ఇటీవల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డు వెంట నడుస్తూ.. మొక్కల పరిస్థితిపై అధికారులను అడదిగారు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఇంకా ఎన్ని నాటాలి? అని పీఆర్ ఏఈ నారాయణ, ఈజీఎస్ ఏపీవో ఆంజనేయులులను ప్రశ్నించారు. మొత్తం 1600 మొక్కల్లో 600 నాటామని, ఇంకా వెయ్యి త్వరలోనే నాటుతామని వారు మంత్రికి వివరించారు. కొన్ని గుంతల్లో మొక్కలు నాటకుండా వదిలి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా 33 ఫీట్ల వెడల్పుతో మొక్కల నాటాలని చెబుతున్నా కూడా 20–24 ఫీట్లలో మొక్కలు నాటడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోడ్డును విస్తరిస్తే మొక్కల పరిస్థితి ఏమిటని? ముందు చూపు, పక్కా ప్రణాళికలు లేకుండా మొక్కలు నాటడం వెనక అధికారుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. చిన్న మొక్కలు నాటొద్దని ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెట్టారని అన్నారు. నాటిన మెుక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేయకపోవడంపై అధికారులను తీవ్రంగా మందలించారు. ‘ఇష్టం ఉంటే పనిచేయండి.. లేదంటే మానేయండి.. అంతేకాని హరితహారంపై నిర్లక్ష్నాన్ని సహించేది లేదు..’ అని స్పష్టం చేసారు. మంత్రి వెంట జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, నాయకులు ముడుపు దామోదర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, ఇజ్జగిరి అశోక్, రాజన్న, కోల పరమేశ్వర్, తదితరులు ఉన్నారు. -
ప్రతీ మొక్కను సంరక్షించాలి
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్న మెుక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యే, పీవో ఇంద్రవెల్లి : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో ఉన్న త్రివేణి సంఘం చెరువు కట్టపై మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించి చెట్లు లేకపోవడంతో వర్షాలు సరిగా పడక పర్యావరణం కలుషితమవుతోందని తెలిపారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఉట్నూర్ ఆర్డీవో ఐలయ్య, ఎంపీపీ జాదవ్ మీరాబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు దేవ్‌పూజే సంగీత, ముత్నూర్ సర్పంచ్ తుమ్రం తారమతి, తహసీల్దార్ ఆజ్మీర శంకర్‌నాయక్, ఎంపీడీవో బానోత్ దత్తారాం, ఎఫ్ఆర్వో శివకుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుపీయన్ తదితరులు పాల్గొన్నారు. రాథోడ్ కలప తరలించారు.. మేము మొక్కలు నాటుతున్నాం మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అక్రమంగా కలప తరలిస్తే.. అడవిని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి రామన్న విమర్శించారు. అటవీ సంపదను తరలించిన ఆయనకు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు. మార్కెట్ కమిటీ ఏడీపై మంత్రి ఆగ్రహం జన్నారం : ‘మార్కెట్ యార్డు ఆవరణలో మెుక్కలు నాటేందుకు వచ్చిన విద్యార్థులతో మెుక్కలు ఎందుకు నాటించలేదు.. హరితహారం అంటే తమాషాలా అనిపిస్తుందా..’ అంటూ మంత్రి రామన్న జన్నారం మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే విద్యార్థులతో మెుక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, డీఎఫ్‌వో రవీందర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీటీసీ సభ్యులు జ్యోత్సS్న, సుమలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కపెల్లి, వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.