
వర్షాభావంతో లక్ష్యసాధన పూర్తికాలేదు
కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సీజన్లో వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో హరితహారం లక్ష్యాన్ని సాధించలేకపోయామని కలెక్టర్ రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి గణాంకాలను కలెక్టర్ వివరిస్తూ పైవిధంగా స్పందించారు. జిల్లాలో 3.32కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. నాటిన వాటిలో 60శాతం మొక్కల్ని జియోట్యాగింగ్ చేశామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఆమ్రపాలి, ఎస్పీ నవీన్‌కుమార్, ప్రత్యేకాధికారి శోభ తదితరులు పాల్గొన్నారు.