మొక్కలు నాటిన హోంమంత్రి
⇒ గత పాలకులు చెట్లు నాటకపోవడం వల్లె రాష్ట్రంలో దుర్భిక్షం
⇒ మొక్కలు నాటని వారు సమాజ వ్యతిరేకులు
⇒ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి
మేడ్చల్: గత పాలకులు రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటకపోవడం వల్లే నేడు తెలంగాణ దుర్భిక్ష పరిస్థితులు నెలకున్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ, కండ్లకోయలోని మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఈసంధర్భంగా ఐటిఐలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు చెట్లను నరికారె గాని నాటలేదని ఆరోపణలు చేశాడు.ముఖ్యమంత్రి కేసీఆర్ దూర ఆలోచనలు చేసి నాటి చక్రవర్తి అశోకుడి లా రాష్ట్రంలో మొక్కలు నాటడానికి ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నాడు.ఇంటికోక మొక్క తప్పనిసరిగా నాటాలని మొక్క నాటని వారు సమాజవ్యతిరేకులని అన్నారు.అందరు భాగస్వాములై మొక్కలు నాటితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నాడు. రాష్ట్రంలో చేడుతున్న పనుల వల్ల ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని త్వరలో హరితహారం కార్యక్రమం గిన్నిస్ బుక్కులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.మిషన్ భగీరధ కార్యక్రమాన్ని ప్రధాని మోడి అగస్టు 7న గజ్వెల్‌లో ప్రారంబిస్తారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 40 వేల మొక్కలు నాటారని, ఐటిఐలలో లక్ష మొక్కలు, కార్మిక శాకలో మూడు లక్షల మొక్కలు నాటాలని అన్నారు.
మేడ్చల్ ఐటిఐ తీరు పై నాయిని ఆగ్రహం..
మేడ్చల్ ఐటిఐ తీరుపై హోం,కార్మిక ఉపాది కల్పన శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లాలు ను చూసి ఇళ్ళు ను చూడు అన్న చందంతో ఐటిఐ ప్రిన్సిపాల్ శైలజను పోల్చారు. ఐటిఐ ప్రధాన గేటు నుండి భవనం వరకు కంకర తేలిన రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రోడ్డె బాగు చేయలేని అధికారులు పిల్లలకు చదువులు ఏం చెబుతారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 లక్షల మంజూరీ కోసం అర్జి పెట్టకున్నామని శైలజ వివరిస్తుండగా 4లక్షల నిధులు సమకూర్చకోకపోతే ఎలా అంటూ అక్కడే ఉన్న ఉపాధికల్పన డైరక్టర్ నాయక్‌ను ప్రశ్నించారు.వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటిఐలో ఖాళీగా ఉన్న 22 పోస్టులను మంజూరీ చేస్తామని హమీ ఇచ్చారు.
పీఎస్‌కు ఐటిఐలో ఎకరం స్థలం కేటాయించా
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఇరుకైన ప్రదేశంలో శిధిల భవనంలో కోనసాగుతుందని హోంమంత్రి దృష్టి సారించి నూతన భవనానికి నిధులు మంజూరీ చేసి భవనాన్ని నిర్మించడానికి ఆయన చూస్తున్న ఉపాధి కల్పన శాఖ ఆధీనంలో ఉన్న ఐటిఐ స్థలంలో ఎకరం ను పోలీస్‌స్టేషన్‌కు కేటాయించాలని కోరారు.చూస్తానని హోమంత్రి చెప్పారు. మేడ్చల్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలంతా మంత్రులయ్యారని సుధీర్‌రెడ్డి సైతం మంత్రి అవుతారమె అంటూ సెటర్లు వేశారు.ఎమ్మెల్యే లు ఎంతబాగా హరితహారంలో పాల్గొని అధిక చెట్లు పెడితే అన్ని అధిక నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని అంటూ విషయాన్ని గుర్తు చేశారు.కార్యక్రమంలో ఎల్‌టీఎఫ్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అహ్మద్ నవీద్, ఉపాధి కల్పన శాఖా డైరక్టర్ కె.వై నాయక్, ఎంపీపీ విజయలక్ష్మీ, జెడ్‌పీటీసీ జెకె శైలజ, మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యనారయణ, ఎంపీడీఓ దేవసహయం,తహసిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డి,టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.