Published
Sat, Aug 27 2016 11:20 PM
| Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
ఇదేనా ‘హరితహారం’
మిర్యాలగూడ టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. మిర్యాలగూడ పట్టణంలో లక్ష మెుక్కలు నాటాలనే లక్ష్యంతో నర్సరీల నుంచి భారీగా మెుక్కలను తీసుకువచ్చి మున్సిపాలిటీలో ఉంచారు. గత నెలలో మున్సిపల్ అధికారులు ఆర్భాటంగా కొన్ని మెుక్కలు నాటినా మిగతా వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలోనే అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. వీటిలో కొన్ని మెుక్కలు ధ్వంసం కాగా మరికొన్నింటిలో మట్టి పూర్తిగా కరిగి మెుక్కలు ఎండిపోయాయి. ఈ నెల 31 వరకు హరితహారం లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారుల్లో చలనం కనబడడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెుక్కలను నాటాలని స్థానికులు కోరుతున్నారు.