
హరితహారంపై నిర్లక్ష్యం వీడాలి
డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి
కుల్కచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని డీఆర్‌డీఏ పీడీ, మండల ప్రత్యేకాధికారి సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తప్పకుండా 40 వేల మొక్కలు నాటాలని సూచించారు.ముఖ్యంగా సెక్టోరియల్ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూముల్లో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని ఉపాధిహామీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఓ చారి, ఏఓ పాండు, ఏపీఎం శోభ, అటవీశాఖ అధికారి పర్వేజ్ ,విద్యాధికారి అబీబ్‌హమ్మద్, డిప్యూటీ తహసీల్దార్ అశోక్, ఆర్‌ఐ యాదయ్య పాల్గొన్నారు.