సాక్షి, లండన్ :
ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో 'తెలంగాణకు హరితహారం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం 'తెలంగాణకు హరితహారం' అని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ యూకే సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులంతా మొక్కలు నాటి, ప్రజలంతా ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం ౩౩శాతం భూమి అడవులు, చెట్లు ఉండాలన్నారు. ఇది మానవ, జంతు, మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరం అని తెలిపారు. తెలంగాణలో మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 25.16 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన ౩౩శాతం స్థాయికి అడవులను, పచ్చదనం పెంచడంలో భాగంగా 'తెలంగాణ హరిత హారం'ను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు.
లక్ష్యం : 230 కోట్ల మొక్కలు
అటవీ ప్రాంతాలు : 100 కోట్ల మొక్కలు
అటవీ ప్రాంతాలు కానివి : 120 కోట్ల మొక్కలు
హెచ్.ఎం.డి.ఎ. : 10 కోట్ల మొక్కలు
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెలుతోందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ యూకే నాయకులతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు కూడా పాల్గొన్నారు. లండన్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి పాల్గొని, స్థానిక ప్రవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శిలు శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల, సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, వేణు, జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి, జాగృతి నాయకులు లండన్ గణేష్, వంశీ సముద్రాల, టాక్ సభ్యులు రాకేష్ వాకా, వెంకీ, రవి కిరణ్, రాకేష్ పటేల్, ప్రతీక్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.