NRI TRS UK
-
తలసానిని సత్కరించిన ఎన్నారై తెరాస నాయకులు
లండన్: వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై తెరాస యూకే దాదాపు 12 సంవత్సరాలుగా లండన్ గడ్డపై చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రి తలసానికి ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి వివరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అటు తలసాని శ్రీనివాస్, తలసాని సాయి గెలుపు కోసం ఎన్నారై తెరాస క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన విషయాలని గుర్తు చేశారు. దశాబ్ద కాలంగా యూకేలో అటు తెలంగాణ సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలే కాక ముఖమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఖండాంతరాల్లో బలపరుస్తూ తెరాస పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, మీ స్ఫూర్తి చాలా గొప్పదని అశోక్ మరియు రత్నాకర్ బృందాన్ని మంత్రి తలసాని అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నారై తెరాస యూకే చేస్తున్న సేవ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని , త్వరలో మళ్ళీ యూకేకి వస్తానని అప్పుడు ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో గొప్ప ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. అదే పర్యటనలో ఉన్న తలసాని సాయి కూడా ఎన్నారై తెరాస నాయకులు కలిశారు. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ దుసారి, రత్నాకర్ కడుదుల, హరిగౌడ్ నవాపేట్, మల్లారెడ్డి బీరం, సతీష్ బండ, మట్టారెడ్డి, నవీన్ భువనగిరి, అబు జాఫ్, సేరు సంజయ్, మదు, గణేష్ కుప్పలా తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
లండన్ : ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. జయశంకర్, అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేశారని తెలిపారు. అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకై జయశంకర్ చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య జయశంకర్ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ కేవలం కేసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి నవాపేట్, సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, లండన్ ఇంచార్జిలు గణేష్ పాస్తం, భాస్కర్ మొట్టా, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ ప్రశాంత్ కటికనేని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్లతో పాటు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని, టీ.డీ.ఎఫ్ అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి ప్రతినిధులు, స్థానిక తెలంగాణ వాదులు కిషోర్ మునగాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎన్ఆర్ఐలు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి హరీష్ రావుతో కలిసి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే బృందం పరిశీలించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న ఆరవ ప్యాకేజీ టన్నెల్, రిజర్వాయర్ల పనులను గురువారం ఎన్ఆర్ఐలు సందర్శించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎత్తిపోతల వ్యవస్థ పనిచేసే తీరును అక్కడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎన్ఆర్ఐలు కొనియాడారు. హరీష్‌రావు ఎంతో పట్టుదలతో ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో పనులు చేస్తుండడం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సాగు నీటి, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్రం అతి వేగంగా అభివృద్ధి పథానికి వెళుతుందని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో తెలంగాణ వేగంగా బంగారు తెలంగాణగా మారతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ బృందంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, మల్లేష్ పప్పుల, సత్య చిలుముల, స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాజేష్ ఉన్నారు. -
తెలంగాణ బడ్జెట్‌పై ఎన్నారైల హర్షం
లండన్: ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-2019 బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు. లండన్‌లో ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రవాసుల పక్షాన నిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చారిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రూ. 5కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని, ముఖ్యంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందిస్తున్న తీరు వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు అనిల్ కూర్మాచలం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ బడ్జెట్‌ని ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సృజన్ రెడ్డి తదితరులు తెలిపారు. -
లండన్‌లో 'తెలంగాణకు హరితహారం'
సాక్షి, లండన్ : ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో 'తెలంగాణకు హరితహారం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం 'తెలంగాణకు హరితహారం' అని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులంతా మొక్కలు నాటి, ప్రజలంతా ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం ౩౩శాతం భూమి అడవులు, చెట్లు ఉండాలన్నారు. ఇది మానవ, జంతు, మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరం అని తెలిపారు. తెలంగాణలో మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 25.16 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన ౩౩శాతం స్థాయికి అడవులను, పచ్చదనం పెంచడంలో భాగంగా 'తెలంగాణ హరిత హారం'ను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. లక్ష్యం : 230 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలు : 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలు కానివి : 120 కోట్ల మొక్కలు హెచ్.ఎం.డి.ఎ. : 10 కోట్ల మొక్కలు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెలుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే నాయకులతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు కూడా పాల్గొన్నారు. లండన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి పాల్గొని, స్థానిక ప్రవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శిలు శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల, సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, వేణు, జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి, జాగృతి నాయకులు లండన్ గణేష్, వంశీ సముద్రాల, టాక్ సభ్యులు రాకేష్ వాకా, వెంకీ, రవి కిరణ్, రాకేష్ పటేల్, ప్రతీక్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.