మొక్కలు నాటిన ఎస్పీ దుగ్గల్
మొక్కలు నాటిన ఎస్పీ దుగ్గల్
Published Wed, Jul 20 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఆదిలాబాద్ క్రై ం : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బుధవారం మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులు బ్యాండ్‌మేళాలతో ఎస్పీకి స్వాగతం పలికారు.
పాఠశాలలో 500 మొక్కలు నాటే కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నందున హరితహారం కార్యక్రమంలో గిరిజన గ్రామాల్లో పోలీసులు మునగచెట్లు నాటుతున్నారన్నారు. మునగచెట్ల పెంపకంతో రక్తహీనత బాధితులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతీహాస్టల్‌లో పోలీసులు మునగచెట్లు నాటాలని ఆదేశించారు.గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఏఎసై ్స అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement