వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్, అధికారులు
రాష్ట్ర ఫారెస్టు ఫోర్స్ అధికారి పీకే ఝూ
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి వచ్చే ఏడాది కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఫారెస్టు ఫోర్స్ ఉన్నతాధికారి పీకే ఝూ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమంపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు నిర్థేశించిన లక్ష్యం, నాటిన మొక్కలు, మొక్కల రక్షణకు చేపట్టిన చర్యలను ఆన్‌లైనలో ఆప్‌లోడ్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. మైక్రో ప్రణాళికలు రూపొందించుకోని ప్రాంతాలవారీగా మొక్కల రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కలకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నాటిన మొక్కలను నూటికి నూరుశాతం రక్షించాలన్నారు. ఈ ఏడాది మిగిలిన లక్ష్యాన్ని వచ్చే ప్రణాళికలో చేర్చి హరితహారం కార్యక్రమం కార్యచరణను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మండలాల వారీగా నర్సరీలను ఎంపిక చేయాలన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ రెండు కోట్ల 71 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసి కోటి 58 లక్షల మొక్కల వివరాలను ఆప్‌లోడ్ చేశామన్నారు.
సూక్ష్మ ప్రణాళికలను రూపొందించుకొని నాటిన మొక్కల ర„ý క్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి అన్ని మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి కార్యచరణను పూర్తి చేసినట్లు వివరించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ అధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్, గఢ ప్రత్యేకాధికారి హన్మంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.