నగరంలో నేడు
నేడు పింక్ క్రూసేడర్ రైడ్
రాయదుర్గం : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపోందించేందుకు గాను శనివారం పింక్ క్రూసేడర్ రైడ్ నిర్వహించనున్నారు. కాంటినెంటల్ కేన్సర్ సెంటర్, జింగిల్ ఫౌల్, డుకాటీ, నోవాటెల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించునున్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి 150 మంది బైకర్లు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వద్దకు ర్యాలీ నిర్వహిస్తారు. ఉదయం 6.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ బైక్ ర్యాలీలో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 7.30 ర్యాలీ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
క్యాండిల్స్ తయారీపై వర్క్‌షాప్
దీపావళి పండుగలో వెలిగించే దీపాలను స్వయంగా తయారు చేసుకోవాలని ఆశించే వారి కోసం కొండాపూర్‌లోని సిమ్సమ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా ఇది జరుగుతుంది.
ఆర్ట్ థెరపీ 3న..
వచ్చే నవంబరు 3న సెరెనిటీ ఆర్ట్ థెరపీ పేరుతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఫౌండేషన్ థియేటర్లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. సంగీతం, కళ, స్పీచ్‌ల ద్వారా మానసిక ఆరోగ్యం అనే అంశంపై దీనిని నిర్వహిస్తున్నారు. దీనిలో సాండిల్య పీసపాటి సంగీతాన్ని, డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్పీచ్, శహిష్ట ఫాతిమా ఆర్ట్ అందించనున్నారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది
పెయింట్ అండ్ సిప్ 2న...
నచ్చిన పానీయాన్ని సేవిస్తూ వచ్చినట్టు చిత్రాలను గీయాలని కోరుకునే వారి కోసం... మై లిటిల్ థింగ్స్ ఆధ్వర్యంలో పెయింట్ అండ్ సిప్ ఈవెంట్‌ను నవంబరు 2న నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ బార్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది.
మైక్రో ఆర్ట్ వర్క్‌షాప్
బంజారాహిల్స్‌లోని ఆక్టోస్పేసెస్లో మైక్రో ఆర్ట్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. నవంబరు 3న నిర్వహించే ఈ వర్క్‌షాప్‌కు ఆర్టిస్ట్ నవనీత్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. చాక్ మీద కార్వింగ్స్, పెన్సిల్ లీడ్ మీద కార్వింగ్స్...నేర్పించే ఈ వర్క్‌షాప్ ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుంది.
సాలిడారిటీ ఆర్ట్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్‌లోని డెహ్రా ఆర్ట్ గ్యాలరీలో ‘సాలిడారిటీ’ పేరుతో చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దాదాపు 60 మంది చిత్రకారులు పాల్గొంటున్నారు. శిల్పులు సైతం పాల్గొంటున్న ఈ ప్రదర్శనలో 180 ఆర్ట్ వర్క్స్ కొలువుదీరాయి. ఈ ప్రదర్శన 31 వరకూ కొనసాగుతుంది.
మరిన్ని ప్రోగ్రామ్స్
వేదిక: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
► ‘ఎన్నెన్నోజన్మలబంధం’ సినీ గీతాలు
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
► ఇండియా డ్యాన్స్ ఫెస్టివెల్
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
► థర్స్డే నైట్లైవ్ విత్ ది రింకి శర్మ ట్రియో
వేదిక: హార్ట్ రాక్ కేఫ్ హైదరాబాద్, బంజారాహిల్స్
సమయం: రాత్రి 8 గంటలకు
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, మారేడ్‌పల్లి
► భరతనాట్యం క్లాసెస్ బై రోషిణి
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
► మోహినియట్టం క్లాసెస్
సమయం: సాయంత్రం 4–30 గంటలకు
► కరాటే ట్రైనింగ్ క్లాసెస్
సమయం: సాయంత్రం: 6–00 గంటలకు
► థర్స్డే నైట్‌విత్ అరుణ్ అండ్ అనుప్
వేదిక: స్టోన్ వాటర్స్ కిచెన్ అండ్ లాంజ్ , జూబ్లీహీల్స్
సమయం: రాత్రి 7–30 గంటలకు
► మ్యాథ్స్ క్లాసెస్ విత్ మీనా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్ ఎన్ మోర్ లైబ్రరీ యాక్టివిటీ సెంటర్ , వెస్ట్ మారేడ్‌పల్లి
సమయం: సాయంత్రం 5 గంటలకు
► ఐఎస్బీ ఫ్యామిలీ బిజినెస్ కాఫీ మీట్
వేదిక: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , గచ్చిబౌలి
సమయం: సాయంత్రం 6 గంటలకు
►ఐడబ్ల్యూఎన్ తెలంగాణలీడర్షిప్ కాంక్లేవ్
వేదిక: ట్రైడెంట్ , మాదాపూర్
సమయం: ఉదయం 9 గంటలకు
► థర్స్డే నైట్ లైవ్ విత్ డీజే సన్నీ
వేదిక: స్పాయిల్ పబ్ , జూబ్లీహీల్స్
సమయం: రాత్రి 7 గంటలకు
► థర్స్డే బాలీవుడ్ నైట్లైవ్ విత్ అభిజిత్
వేదిక: కార్పెడైం , జూబ్లీహిల్స్
సమయం: రాత్రి 8 గంటలకు
► థర్స్డే నైట్ లైవ్ విత్ డీజే రాబ్జ్
వేదిక: ప్రిజం క్లబ్ అండ్ కిచెన్ ,గౌలిదొడ్డి
సమయం: రాత్రి 8 గంటలకు
► హరికథ మహోత్సవం –రుక్మిణీ కళ్యాణం: బైకే నాగమణి, బాగవతరణి
వేదిక: కళా సుబ్బారావు కళావేదిక , చిక్కడపల్లి
సమయం: సాయంత్రం 6 గంటలకు
► థర్స్డే లేడీస్ నైట్
వేదిక: స్నార్ట్ హైటెక్స్ ,ఖానాపేట్
సమయం: రాత్రి 7 గంటలకు .