- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
హరిత తెలంగాణగా రూపుదిద్దుదాం
Published Wed, Aug 10 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
నాగర్‌కర్నూల్: ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నల్లవాగు నుంచి ఉయ్యాలవాడ వరకు బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భావితరాలను దృష్టిలో ఉంచకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లే తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినపుడే మన బాధ్యతను నెరవేర్చినట్టని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ డీఈడీ కళాశాల, కస్తూర్భా విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, ఉయ్యాలవాడ సర్పంచ్ మనోహరమ్మ, ఎంపీటీసీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement