తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్ డే’
తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్ డే’
Published Sat, Jul 15 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో శనివారం గ్రీన్ డే పాటించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటనున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 9 గంటల నుంచి హరితహారంపై ర్యాలీలు జరగనున్నాయి.
10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు పర్యావరణం, మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు జరుగుతాయి. అన్ని విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Advertisement