Green Day
-
'గ్రీన్ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్
పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా మంత్రులు హారితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాఠశాలల్లో ‘గ్రీన్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి పాఠశాలలో మొక్కలు నాటారు. దమ్మపేటలో... దమ్మపేట మండలం గండుగులపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్భా గాంధీ విద్యా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ ఇలంబర్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్ డే’
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో శనివారం గ్రీన్ డే పాటించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటనున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 9 గంటల నుంచి హరితహారంపై ర్యాలీలు జరగనున్నాయి. 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు పర్యావరణం, మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు జరుగుతాయి. అన్ని విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
15న విద్యా సంస్థల్లో గ్రీన్‌డే
ఉపముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: మూడో దశ హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 15న విద్యా సంస్థల్లో గ్రీన్‌డే పేరుతో నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు దాదాపు 30వేల విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించా రు. హరితహారాన్ని పాఠ్యాంశంగా రూపొం దించే ఆలోచన చేస్తున్నామన్నారు. ‘హరిత పాఠశాల– హరిత తెలంగాణ’ నినాదంతో హరితహారాన్ని విద్యా సంస్థల్లో చేపడుతున్నామన్నారు. గ్రీన్‌డే రోజున హరితహారంపై ర్యాలీ లు, విద్యా సంస్థల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు హరితహారంపై వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మొక్కలు నాటి వాటిని బాగా పరిరక్షించిన విద్యా సంస్థలను ఉత్తమ హరిత విద్యా సంస్థగా గుర్తించి వారికి కూడా బహుమతులు ఇస్తామని కడియం తెలిపారు.