'గ్రీన్‌ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్ | telangana ministers indrakaran and Tummala in green day | Sakshi
Sakshi News home page

'గ్రీన్‌ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్

Published Sat, Jul 15 2017 2:38 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

'గ్రీన్‌ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్

'గ్రీన్‌ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్

పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా మంత్రులు హారితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాఠశాలల్లో ‘గ్రీన్‌ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి పాఠశాలలో మొక్కలు నాటారు.

దమ్మపేటలో...
దమ్మపేట మండలం గండుగులపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి కొబ్బరి మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్‌
నిర్మల్‌: నిర్మల్‌ రూరల్‌ మండలం కొండాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్‌ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్భా గాంధీ విద్యా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్‌ ఇలంబర్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement