indrakaran
-
వైస్ చైర్మన్‌ను తొలగించాల్సిందే
నిర్మల్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిర్మల్ మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ సాజిద్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ నాయకులు సోమవారం బల్దియాను ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఈ అంశంపై బీజేపీ నేతలు కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెన్షన్: మంత్రి ఇంద్రకరణ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కేసు పూర్తి వివరాలు అందాక పదవి నుంచి కూడా తొలగిస్తామని మీడియాకు చెప్పారు. -
'గ్రీన్ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్
పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా మంత్రులు హారితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాఠశాలల్లో ‘గ్రీన్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి పాఠశాలలో మొక్కలు నాటారు. దమ్మపేటలో... దమ్మపేట మండలం గండుగులపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్భా గాంధీ విద్యా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ ఇలంబర్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఉన్న పుష్కరఘాట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పరిశీలించారు. శుక్రవారం అక్కడికి చేరుకున్న మంత్రులు పుష్కర ఘాట్ పనులపై ఆరా తీశారు. రామన్నగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాలమ్మ దేవాస్థానంకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో మంత్రులు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఘాట్ వద్దకు నీటి మళ్లింపు విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
గోదావరి పుష్కరాలకు 500 కోట్లు : మంత్రి