
నిర్మల్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిర్మల్ మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ సాజిద్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ నాయకులు సోమవారం బల్దియాను ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఈ అంశంపై బీజేపీ నేతలు కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చారు.
పార్టీ నుంచి సస్పెన్షన్: మంత్రి ఇంద్రకరణ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కేసు పూర్తి వివరాలు అందాక పదవి నుంచి కూడా తొలగిస్తామని మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment