15న విద్యా సంస్థల్లో గ్రీన్‌డే
ఉపముఖ్యమంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: మూడో దశ హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 15న విద్యా సంస్థల్లో గ్రీన్‌డే పేరుతో నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు దాదాపు 30వేల విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించా రు. హరితహారాన్ని పాఠ్యాంశంగా రూపొం దించే ఆలోచన చేస్తున్నామన్నారు. ‘హరిత పాఠశాల– హరిత తెలంగాణ’ నినాదంతో హరితహారాన్ని విద్యా సంస్థల్లో చేపడుతున్నామన్నారు.
గ్రీన్‌డే రోజున హరితహారంపై ర్యాలీ లు, విద్యా సంస్థల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు హరితహారంపై వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మొక్కలు నాటి వాటిని బాగా పరిరక్షించిన విద్యా సంస్థలను ఉత్తమ హరిత విద్యా సంస్థగా గుర్తించి వారికి కూడా బహుమతులు ఇస్తామని కడియం తెలిపారు.