కొనసాగిన హరితహారం
Published Fri, Aug 12 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
చిన్నచింతకుంట : మండలంలోని దుప్పల్లిలో శుక్రవారం సర్పంచ్ పీ ప్రేమ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు మాసన్నయాదవ్ ఆద్వర్యంలో మామిడి మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. వీటి ద్వార నే వర్షాలు కురుస్తాయని, లేదంటే ఏడారిగా మారి ఈ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంటుందని చెప్పారు. గ్రామాల్లో తమ ఇంటి ముందు పొలం గట్టున చెట్లు నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో మహిళ సంఘం సభ్యులు శ్యామలమ్మ,సీసీ రాజు,మహిళ సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement