ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
Published Sat, Jul 9 2016 4:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
హైదరాబాద్ : నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎరైజ్ సంస్థ, సాక్షి ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లో వివిధ స్కూళ్ళ విద్యార్థులు హరితహారంపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ గ్రౌండ్ లో మొక్కలు నాటి అనంతరం ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
డివిజన్‌లో లక్ష మొక్కలను నాటి పర్యావరాణాన్ని రక్షించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా మొక్కలను నాటేందుకు 69 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. శనివారం హిమాయత్‌నగర్‌లో రోడ్డుకు ఇరువైపులా స్థానిక నేతలతో కలసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ మొక్కలను నాటే కార్యక్రమం మహోద్యమంగా తలపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలను, కార్పొరేట్ కార్యాలయాలను భాగస్వాములను చేస్తున్నామన్నారు.
Advertisement