- అధికారులతో సమీక్షలో ఆర్డీఓ సూచన
సిద్దిపేట జోన్: హరితహారంలో భాగంగా నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యాన్ని సమష్టిగా అధిగమిద్దామని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా హరితహారంలో నాటి మొక్కలు, వాటి స్థితిగతులను తెలుసుకున్నారు.
గ్రామానికి 40 వేల మొక్కల లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. ఆయా మండలాలకు అవసరమైన మొక్కలను అటవీ శాఖ, నర్సరీల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సుధాకర్, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, సిద్దిపేట రేంజ్ అధికారి శ్యాంసుందర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.