చాలెంజ్‌ను స్వీకరించిన పవన్‌ | Pawan Kalyan Accepted Haritha Haram Challenge By Chiranjeevi | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 7:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Accepted Haritha Haram Challenge By Chiranjeevi - Sakshi

ఒకప్పుడు రైస్‌ బకెట్‌ చాలెంజ్‌, మొన్నటి వరకు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌, ప్రస్తుతం హరితహారం చాలెంజ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖులు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. మరికొందరికి సవాళ్లను విసురుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ ఎంటరైంది. ఓ ప్రముఖ చానెల్‌ అధినేత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి .. ఓ మొక్కను నాటారు. అనంతరం చిరు మరో ముగ్గురికి చాలెంజ్‌ను విసిరారు. 

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, రామోజీరావు, పవన్‌ కళ్యాణ్‌లకు గ్రీన్‌చాలెంజ్‌ను విసిరారు. తాజాగా ఈ సవాల్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్వీకరించారు. ఓ మొక్కను నాటుతున్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ చాలెంజ్‌లో కేటీఆర్‌, కవిత, రాజమౌళి, బ్రహ్మానందం, చిరంజీవి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement