
ప్రాణాలతో వచ్చిన ఆషా
అన్నానగర్: తంజావూరు జిల్లా తిరుభువనం తోప్పు వీధికి చెందిన రామచంద్రన్ ఎలక్ట్రీషియన్. ఇతని భార్య ఆషా (40). వీరికి విఘ్నేష్ (22) అనే కుమారుడు ఉన్నాడు. ఆషాకి మానసిక వ్యాధి ఏర్పడిన స్థితిలో గత 13 సంవత్సరాలకు ముందు రామచంద్రన్ విడాకులు పొందాడు. అనంతరం ఇంకొక మహిళను వివాహం చేసుకుని కుమారుడు విఘ్నేష్‌తో నివసిస్తున్నాడు. గత నెల 26న కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స ఫలించక మృతి చెందింది.
దీనిపై పోలీసులు విచారణ చేశారు. ఇందులో మృతి చెందింది తిరుభువనానికి చెందిన ఆషా అని నిశ్చయించి మృతదేహాన్ని ఆమె కుమారుడు విఘ్నేష్‌కు అప్పగించారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు. ఈ స్థితిలో సోమవారం తిరుభువనం దుకాణ వీధిలో ఆషా తిరుగుతున్నట్లు గుర్తించిన తెలిసిన వారు వెంటనే ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వచ్చి ఆమెను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment