వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో కన్వినర్‌ ఇంటిపై దాడి | YSRCP social media co conveners house attacked | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో కన్వినర్‌ ఇంటిపై దాడి

Published Fri, Jun 28 2024 5:47 AM | Last Updated on Fri, Jun 28 2024 5:47 AM

YSRCP social media co conveners house attacked

అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు టీడీపీ గూండాల విధ్వంసం

తెనాలి అర్బన్‌: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా గుంటూరు జిల్లా కో–కన్వినర్‌ నీలి అజయ్‌కుమార్‌ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి టీడీపీ గూండాలు దాడి చేశారు. నాలుగు గంటలపాటు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటకు చెందిన నీలి అజయ్‌ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా జిల్లా కో–కన్వినర్‌. ప్రతిపక్ష పార్టీల విమర్శలను సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టేవాడు. 

అతనిపై కక్ష పెంచుకున్న కొందరు టీడీపీ గూండాలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే బెదిరింపులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అజయ్‌ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవా­రం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొందరు టీడీపీ గూండాలు కారులో అతని ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కర్రలు, రోకలి బండలతో కిటికి అద్దాలు పగలకొట్టారు. కిటికీల నుంచి కర్రలు, రాడ్లతో లోపల అందిన వస్తువులను ధ్వంసం చేశారు. 

ఇంటి ఆవరణలోని వాషింగ్‌ మిషన్, పూల కుండీలు, వస్తువులను పగులగొట్టారు. దీనిని గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిపై దుర్భాషలాడి, బెదిరించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నాలుగు గంటల పాటు విధ్వంసం కొనసాగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement