బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.
ఈ ఘటన బహ్రయిచ్‌లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.
ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment