
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్‌లోని ఎ–బ్లాక్ హాస్టల్‌లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు.
రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment