మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్‌ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.
పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment