
పట్నా: బిహర్‌లో ఒక వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జెహనాబాద్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా.. రోడ్డు మధ్యలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు వాహనాన్ని తీసేయాలని సూచించాడు.
దీంతో సదరు వ్యక్తి పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి మరీ దాడి చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతడిని వారించారు. ఆ తర్వాత నిందితుడు బైక్‌ను రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: తెలుగు అకాడమీ స్కాం కేసు: డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment