కొత్త ఏడాది నేపథ్యంలో పంచాగ శ్రవణం చేస్తాం. ఈ ఏడాది పెళ్లి ఈడు కొచ్చిన పిల్లలకు పెళ్లి చేయదలచుకున్న తల్లిదండ్రలు వాళ్ల గ్రహస్థితి ఎలా ఉందని తెలుసుకుంటారు. ఎలాంటి వరుడని చేస్తే మంచిది, ఏ నక్షత్రం అయితే బెటర్ అని ముందుగా పంచాగంలో చూసుయకోవడం వంటివి చేస్తారు. తరుచుగా అందరిలో వచ్చే అతిపెద్ద సందేహం.. వధువరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే చెయ్యొచ్చా? లేదా?. చేస్తే ఏమవుతుంది? ఏయే నక్షత్రాల వారు చేసుకోకూడదు..
వధూవరులు ఒకే నక్షత్రములు రాశిభేదమున్నను ఏకరాశి అయి ఉండి వేరే నక్షత్రములైయున్నను శుభము. అయితే కొన్ని నక్షత్రాల వద్దకు వచ్చేటప్పటికీ..వధువరులిద్దరిది ఒకే నక్షత్రమైతే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కొందరికైతే అస్సలు పొసగదు. అందువల్లే నక్షత్రం వారి రాశి ఆధారంగా కొన్ని నక్షత్రాలు ఇరువురి ఒకటే అయినా సమస్య ఉండదు. కొన్ని నక్షత్రాల విషయంలో మాత్రం వివాహం చేసే విషయంలో జాగ్రత్తుతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఏయే నక్షత్రాలు వధువరులిద్దదరిది ఒకటే అయినా సమస్య ఉండదు? వేటికి సమస్య అంటే..
రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్ర ములలోను వధూవరులు ఏకనక్షత్రము వారైనను వివాహము చేయవచ్చును.
అశ్వని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషము మధ్యమములు. తక్కిన నక్షత్రములు ఒక్కటైనచో వధూవరులకు హాని కలుగును. 27 నక్షత్రములలో ఏ నక్షత్రము ఏక నక్షత్రము అయినప్పటికీ పాదములు వధూ వరులు ఇరువురుకి వేరువేరుగా ఉన్నచో వివాహం చేయవచ్చు.
గ్రహమైత్రి బ్రాహ్మణులకు, క్షత్రియులకు గణకూటమి (దేవ, రాక్షస, మనుష్య గణములు) వైశ్యులకు స్త్రీ దీర్ఘ కూటమి, శూద్రులకు యోని కూటమి (జంతువులు) ప్రధానంగా చూడవలెను. పాయింట్ల పట్టిక చూసినప్పటికీ ఈ కూటములు చూడనిదే ఎటువంటి ప్రయోజనం లేదు.
(చదవండి: ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి)
Comments
Please login to add a commentAdd a comment