కిరాతక భర్త.. భార్య పిల్లలపై పెట్రోల్‌ పోసి.. | Wife And Children Sleeping In House Husband Set It Fire | Sakshi
Sakshi News home page

కిరాతక భర్త.. భార్య పిల్లలపై పెట్రోల్‌ పోసి..

Published Sun, Nov 20 2022 9:51 AM | Last Updated on Sun, Nov 20 2022 9:55 AM

Wife And Children Sleeping In House Husband Set It Fire - Sakshi

యశవంతపుర: పిల్లలను చూపించలేదని భార్య, పిల్లలు ఇంటిలో నిద్రిస్తుండగా భర్త నిప్పు పెట్టిన ఘటన హాసన్‌ తాలూకా దొడ్డబీకనహళ్లి గ్రామంలో జరిగింది. ఘటనలో తల్లీ గీతా, ఇద్దరు కొడుకులు గాయపడ్డారు. వివరాలు.. అంకనహళ్లికి చెందిన రంగస్వామి–గీత దంపతుల మధ్య భూ వివాదం ఉండగా, తరచూ గొడవ పడేవారు.  గోరూరు పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు.  

ఇంట్లోకి రానివ్వలేదని..  
గీత నాలుగు నెలల నుంచి ఇద్దరు కొడుకులు రతన్‌ (7), నందన్‌ (5)లతో కలిసి దొడ్డబీకనహళ్లి గ్రామంలో బాడుగ ఇంటిలో వేరేగా ఉంటోంది. శుక్రవారం రాత్రి రంగస్వామి పిల్లలను చూడాలని గీతా ఇంటికెళ్లగా ఆమె రానివ్వలేదు. దీనితో ఆక్రోశానికి గురైన రంగస్వామి అందరూ నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టాడు. మంటల్లో చిక్కుకుని గీత, పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కాపాడి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారికి తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. గోరూరు పోలీసులు రంగస్వామిని అరెస్ట్‌ చేశారు. 

(చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement