
ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో : అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్‌తోపాటు ఇతర మాదకద్రవ్యాలను, విదేశీమద్యం సీసాలను ఎకై ్సజ్ శాఖ ఎస్‌టీఎఫ్ బి టీమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌తోపాటు స్కోడాకారు గంజాయి, హాషిష్ సింథటిక్ డ్రగ్స్, చరస్ వంటి మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుకున్న డ్రగ్స్‌ను, నిందితులను హాజరుపరిచారు. పట్టుబడిన కారు, డ్రగ్స్ విలువ రూ.40 లక్షలుగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌న్‌లో బుధవారం బి టీమ్ ఎస్‌ఐ సంధ్య బృందం ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌పైన ఉన్న ఒక వ్యక్తి స్కోడా కారులోని మరో వ్యక్తి నుంచి ఓజీ కుష్‌ను మార్పిడి చేసుకుంటుండగా ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. కారులో తనిఖీల్లో 500 గ్రాముల ఓజీ కుష్, కిలో గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల హషీష్ సింథటిక్ డ్రగ్స్‌తోపాటు ఐదు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రతీష్ భట్, జై సూర్యలను అరెస్టు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.ఈ సమావేశంలో బి టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ భిక్షా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● అమెరికా నుంచి దిగుమతి
● బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సరఫరా
● పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.40 లక్షలు