
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
అల్వాల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. అల్వాల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్‌దేవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన నర్సింగ్‌రావు కుమారుడు సందీప్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అల్వాల్ టెలికాం కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా వివిధ లోన్ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. యాప్‌ల నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి లోనైన అతను బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.