సాక్షి,హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం(ఆగస్టు9) తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు.
మునిసిపల్ శాఖ తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటను ఎన్నికలున్నప్పటికీ తాము దాచలేదని గుర్తు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి దివాళాకోరు విధానాలని, చిల్లర విమర్శలని ఫైర్ అయ్యారు.
‘రాష్ట్ర ప్రజల కోట్లాది రూపాయల సంపద నీట మునిగింది. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం.
రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని వేగంగా పనులు చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేదు. నెత్తిమీద నీళ్ళు జల్లుకొని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తుండవచ్చు’అని కేటీఆర్ చురకంటించారు.
Comments
Please login to add a commentAdd a comment