సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలకు కేటాయించే కృష్ణా జలాల్లో వినియోగాన్ని కేవలం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని తెలంగాణ మరోమారు కృష్ణా బోర్డును కోరింది. బచావత్ ట్రిబ్యునల్ సైతం తాగునీటి అవసరాల్లో కేవలం 20 శాతమే లెక్కించాలని తెలిపిన అంశాన్ని బోర్డు దృష్టికి తెచ్చింది. కేంద్ర జల సంఘం ఇటీవలి నీటి లభ్యత అధ్యయనంలో గృహావసరాలకు వినియో గించే నీటిని 15 శాతం కిందే లెక్కించాలని సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పటికే బ్రిజేశ్ ట్రిబ్యునల్ వద్ద 2051 వరకు పెరిగే జనాభాకు అనుగుణంగా కృష్ణా బేసిన్‌లో 15.06 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరిన విషయాన్ని బోర్డుకు తెలిపింది. ఈ మేరకు గురువారం ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment