బహుజనులను ఏకంచేసిన మహనీయుడు పాపన్నగౌడ్
Published Fri, Aug 19 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
మాడ్గుల: నవాబులు, జమీందారుల అరాచకాలతో నలిగిపోతున్న బహుజనులను ఏకం చేసి వారి శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయులు సర్ధార్ సర్వాయి పాపన్నౖగౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్ కె. స్వామిగౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని గురువారం మమబూబ్‌నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. పాపన్నగౌడ్ 366వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ నారాయణగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ ఔరంగజేబు పాలనలో కింది స్థాయి జమీందారులు గ్రామాల్లో చేసిన అరాచకాలకు ఎదురుతిరిగాడని, బహుజనులను ఐక్యం చేసి గోల్కొండకోటకు నవాబుగా రాజ్యాధికారం సాగించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. మాడ్గుల, ఆమనగల్లు మండల గ్రామాలకు చెందిన గౌడగీత కార్మికులు ప్రభుత్వానికి పన్ను బకాయిలను రదుద చేసి, కొత్త లైసెన్స్‌లను మంజూరు చేస్తామని స్వామిగౌడ్ గీతకార్మికులకు హమీ ఇచ్చారు.lకార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రగౌడకల్లు గీతవృత్తిదారుల సంఘం అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, గౌడసంక్షేమసంఘం తాలూకా అధ్యక్షుడు అయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు పగడాల రవితేజ, ఎంపీపీ జైపాల్‌నాయక్, ఎంపీటీసీ, సభ్యులు, గౌడనాయకులు పాల్గొన్నారు.
Advertisement