
నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు.
కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment