Sankranti festivities
-
గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు. కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు. -
రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు!
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు నగరంలో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఇప్పటికే ఊరుబాట పట్టారు. ఇలా నగరం నుంచి బయల్దేరే వాహనాలన్నీ నగరం సరిహద్దుల్లోని టోల్గేట్ల వద్దకు చేరుకుని విపరీతమైన రద్దీకి కారణమవుతున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో ఇదే పునరావృతమవుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఫాస్టాగ్‌పై సరైన ప్రచారం నిర్వహించకపోవడంతో ఈసారి కూడా రద్దీ తప్పేలా లేదు. ఏంటి సమస్య? హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రజలు లక్షల్లో ఉన్నారు. వీరంతా దసరా, సంక్రాంతి సమయంలో ఊళ్లకు వెళతారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలన్నీ టోల్గేట్లు దాటే వెళ్లాలి. ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతుండటంతో ఏటా సంక్రాంతి, దసరా, దీపావళి సమయాల్లో టోల్గేట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటోంది. శనివారం నుంచి సెలవులు మొదలవుతున్న దరిమిలా.. ఈ రద్దీ ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణమేంటి? తెలంగాణలో 18 టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో 3 రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో, మిగిలిన 15 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఆధీనంలో ఉన్నాయి. సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఊళ్ల నుంచి తిరిగి వచ్చేక్రమంలో ఒక్కసారిగా టోల్‌గేట్లపై విపరీత మైన భారం పడుతోంది. ప్రతివాహనం టోల్ చార్జీ చెల్లించి, చలానా తీసుకుని వెళ్లాలి. ఇందుకు కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చిల్లర సమస్య, కార్డులు పనిచేయకపోవడం వల్ల మరిం త జాప్యం జరగవచ్చు. శనివారం నుంచి నగరం నుంచి వెళ్లే రద్దీ రెట్టింపవనున్న నేపథ్యంలో టోల్గేట్ల నిర్వాహకులు అదనపు సిబ్బంది ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సమస్యకు కారణాన్ని విస్మరిస్తున్నారు. ఫాస్టాగ్‌పై ప్రచారం ఏది..? ప్రతిసారీ టోల్గేట్ వద్ద ఆగి రుసుము చెల్లించకుండా ఎన్హెచ్ఏఐ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం (ఈటీసీఎస్)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ డివైజ్‌లను వాహనాలకు ముందుభాగాల్లో అమరుస్తారు. ముందుగానే రీచార్జ్ చేసుకుంటే.. టోల్గేట్ల వద్ద సెన్సార్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని గుర్తిస్తాయి. రుసుము ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి, గేటు సులువుగా తెరుచుకుంటుంది. దీనివల్ల ప్రతి వాహనానికి దాదాపు 5 నిమిషాల సమయం మిగులుతుంది. ఇది ఇటు వాహనదారుడికి, అటు టోల్ నిర్వాహకులకు అనుకూలంగా ఉంటుంది. పైగా ట్రాఫిక్ సమస్యలకు, చిల్లర సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే ఫాస్టాగ్‌లపై 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిపై అవగాహన లేని వాహనదారులు డబ్బులు, కార్డుల ద్వారా చెల్లించేందుకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సొంత వాహనాలు పెరుగుతున్న దరిమిలా వీటిపై కావాల్సినంత ప్రచారం జరగడం లేదన్నది వాస్తవం. 2017 చివరినాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఆర్టీసీ ఎందుకు బిగించు కోవడం లేదు.. ఆర్టీసీ బస్సులు కూడా టోల్గేట్ ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుపోతున్నా సమస్యకు పరిష్కారం దిశగా చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫాస్టాగ్ పరికరాలుబిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని టోల్గేట్లలోనూ ఫాస్టాగ్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అయితే, ఆర్టీసీ అధికారుల వాదన మరో రకంగా ఉంది. ఒక్కసారి ఈ డివైజ్‌ను బిగిస్తే అందులో వాహనం వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నిత్యం వేర్వేరు రూట్లలో తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బస్సులకు ఫాస్టాగ్ పరికరాల బిగింపు కార్యరూపం దాల్చడం లేదు. టీఎస్ఆర్టీసీ నగరం నుంచి 5,252 బస్సులువేసింది, ఇందులో 1,500 ఏపీకి వెళ్తాయి. వీటన్నింటిలో ప్రయాణించే వారంతా టికెట్ రేటుతోపాటు టోల్ కూడా చెల్లించాల్సిందే. దీంతో ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–విశాఖ (82733/82734) స్పెషల్ సువిధ ట్రైన్ ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.30 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 5.35కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి (82730) సువిధ ట్రైన్ ఈ నెల 17న రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.55కు లింగంపల్లి చేరుకుంటుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్(82729) సువిధ ట్రై న్ ఈ నెల 20న రాత్రి 9.30 కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రా బాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతి సందడి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలు దువ్వుతున్న పందెం కోళ్లతో స్పీకర్ కోడెల, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిత్రంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మంత్రి రావెల, నన్నపనేని రాజకుమారి, కలెక్టర్, జేసీ తదితరులు సాక్షి, గుంటూరు : జిల్లా కేంద్రం గుంటూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళ వారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆహూతులను అలరించాయి. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ, సంక్రాం తిని అందరి పండుగగా అభివర్ణించారు. ఠవ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో 1.31 కోట్ల మందికి సంక్రాంతి కానుకగా చంద్రన్న సరుకులు పంపించామన్నారు. ఎక్కువ దిగుబడి సాధించిన రైతులకు చంద్రన్న పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రన్న కానుకను పంపించారని పేర్కొన్నారు. కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబం పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో 12.79 లక్షల రేషన్‌కార్డులకు చంద్రన్న సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మద్దాలి గిరితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాల్స్ ... సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. పశువుల అందాల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మత్స్యశాఖ ఏర్పాటు చేసిన చేపల ప్రదర్శన, ఉద్యానవన శాఖ పండ్ల ప్రదర్శన, నెడ్‌క్యాప్ సౌరవిద్యుత్ పరికరాలు, ఐసీడీఎస్ పిండి వంటలు, కోడి పుంజుల ప్రదర్శన కబడ్డీ పోటీలు, రంగవల్లులు, బొమ్మల కొలువు, వేడుకలు తిలకించేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ అబ్బురపరిచాయి. రైతులకు పురస్కారాలు గుంటూరు స్పోర్ట్స్ : సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డులను పి.రామ కృష్ణ, (మండేపూడి అమరావతి మండలం) మేకల లక్ష్మీనారాయణ (రావెల, తాడికొండమండలం), ముత్తవరపు సిద్ధార్థ వెంకటరామయ్యలకు అందజేశారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులు వ్యవసాయ శాఖ-ముదావత్ సోమలనాయక్, పెద్ది నరసింహారావు, గుత్తికొండ రామాంజనేయులు, మాదాల సురేంద్ర, జాష్టి హరిబాబు. పశు సంవర్ధక శాఖ- కొలసాని రమణమూర్తి, కుంట వెంకటకోటయ్య, చేకూరి జార్జిబాబు. ఉద్యానవన శాఖ-1- పొన్నెకంటి శ్రీరాంబాబు. ఉద్యానవన శాఖ-2- మేక దివాకర్ చౌదరి. పట్టు పరిశ్రమల శాఖ- పారా వెంకటేశ్వర్లు. మత్స్యశాఖ- పెనుమచ్చు నాగరాజు, మంతెన కరుణరాజు. విద్యుత్‌శాఖ- ముద్దులూరి చంద్రశేఖర్. సూక్ష్మ నీటి పథకం- నెక్కంటి కృష్ణప్రసాద్‌లకు సంక్రాంతి పురస్కారాలను అందజేశారు. ఉత్తమ అధికారులుగా వ్యవసాయ శాఖకు చెందిన పి.రామాంజనేయులు, ఎన్.సరళ, వి.బుష్‌లు. పశు సంవర్ధక శాఖ- కె.చంద్రశేఖర్‌రెడ్డి, మత్స్యశాఖ - ఎ.వి.రాఘవరెడ్డిలు. బ్యాంకింగ్ రంగం- కె.శ్రీనివాసులు, జె.ఆంజనేయులు చంద్రన్న పురస్కారాలు అందుకున్నారు.