
హీరోయిన్ సమంత గేదెలకు మేత వేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తూ ఎక్కడైనా కనిపించారా? సాదాసీదా పరికిణీ, ఓణీలో ఆమెను చూశారా? చూసి ఉండరు కదా. జస్ట్ మూడే నెలలు ఆగండి. మనం సమంతను అలా చూడొచ్చు. ‘రంగస్థలం’లో మనకు ఇలానే కనిపించనున్నారామె. 1985 నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అచ్చ తెలుగు పల్లెటూరి పడుచు పాత్ర చేస్తున్నారు సమంత.
ఈ సినిమాలో హీరో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సమంత గేదెలను తీసుకెళ్తున్న ఫొటో ఒకటి, కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి. అవి చూసి, ‘భలే భలే పల్లె పడుచు’ అని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30న ‘రంగస్థలం’ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
లీక్స్ తగదు
ఈ నెల 9, 10 తేదీల్లో తమ సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ కావడం పట్ల మైత్రీ మూవీస్ సంస్థ షాక్ అయింది. ఇలా చేయడంవల్ల తమ సినిమా ప్రచారా నికి ఇబ్బంది అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఫొటోలు బయటపెట్టిన వాళ్ల దగ్గర సినిమాకి సంబంధించిన ఇతర మెటీరియల్ ఏమైనా ఉందేమోనని అనుమానంగా ఉందన్నారు. ఈ లీకుల విషయమై నిర్మాతలు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించగా, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment