పుట్టినరోజుకి 'గేమ్ ఛేంజర్' నుంచి సర్ ప్రైజ్! | Ram Charan Game Changer Movie Shooting In Vizag, Deets Inside - Sakshi
Sakshi News home page

పుట్టినరోజుకి 'గేమ్ ఛేంజర్' నుంచి సర్ ప్రైజ్!

Published Fri, Mar 15 2024 12:16 AM | Last Updated on Fri, Mar 15 2024 11:55 AM

ramcharan shooting in vizag: game changer shooting update - Sakshi

వైజాగ్‌ వెళ్లాడు గేమ్‌చేంజర్‌. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పోలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘గేమ్‌చేంజర్‌’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ వారంలో ఆరంభం కానున్న ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పాల్గొంటారు.

రామ్‌చరణ్‌పాల్గొనగా కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్‌ చేశారట మేకర్స్‌. అలాగే ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘గేమ్‌చేంజర్‌’ సినిమాలోని ‘జరగండి..’పాట లిరికల్‌ వీడియో విడుదల కానుంది. అంజలి, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, సునీల్, జయరాం, ఎస్‌జే సూర్య కీలకపాత్రల్లో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వర్తకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement