సంక్రాంతికి బ్రేక్‌! | Team Rangasthalam Back In Hyderabad | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి బ్రేక్‌!

Published Wed, Jan 3 2018 12:40 AM | Last Updated on Wed, Jan 3 2018 12:40 AM

Team Rangasthalam Back In Hyderabad - Sakshi

రెడీ అవుతున్నారు. షూట్‌లో జాయిన్‌ అయ్యేందుకు చిట్టిబాబు రెడీ అవుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ఇందులో సమంత కథానాయిక. సినిమాలో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 12 వరకూ హైదరాబాద్‌లో జరగనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. సంక్రాంతికి బ్రేక్‌ తీసుకుంటారట ‘రంగస్థలం’ టీమ్‌.

ఆ తర్వాత రాజమండ్రిలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ పాల్గొంటారట. ఆల్రెడీ డబ్బింగ్‌ కార్యక్రమాలను కూడా స్టార్ట్‌ చేశారని సమాచారం. ఫైనల్‌గా ఈ నెల ఎండింగ్‌ కల్లా షూటింగ్‌ను కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారట చిత్రబృందం. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తారక రత్నను విలన్‌గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో నయా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement