విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ సుకుమార్ తాజాగా రూపొందించిన చిత్రం 'రంగస్థలం'. మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో సమంత అక్కినేని వెల్లడించారు. 'చిట్టిబాబు' రాంచరణ్ సరసన సమంత నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తయింది. రాంచరణ్, సుకుమార్, మైత్రీ నిర్మాణ సంస్థ వంటి స్పెషల్ టీంతో చేసిన స్పెషల్ జర్నీ ఇది. తమ స్టార్ హోదాకు తగ్గట్టు మనస్సు లోతుల్లోంచి వెలుగు పంచగల వ్యక్తులు వీరు. ఈ బిగ్‌బ్యాంగ్ కోసం ఇక వెయిట్ చేయలేకపోతున్నా' అంటూ సమంత ట్వీట్ చేసింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన 'రంగస్థలం' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చెవిటివాడైన చిట్టిబాబుగా రాంచరణ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంక సమంత ఫస్ట్‌లుక్‌ను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారు. ఇందులో లచ్చిమి పాత్రలో సమంత నటించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment