పాపులర్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రోటిన్‌కు భిన్నమైన పాత్ర అనే చెప్పాలి. ‘జబర్దస్త్’యాంకర్‌గా ఒకవైపు టీవీపై రాణిస్తున్న అనసూయ.. అడపదడపా సినిమాల్లోనూ మెపిస్తున్నారు. ‘క్షణం’ సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇటీవల మోహన్‌బాబు ‘గాయత్రి’ సినిమాలోనూ కనిపించింది. ఇప్పుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా పలుకరించబోతుంది. మెగా హీరో రాంచరణ్, సమంత జోడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయది కీలకపాత్రేనని అంటున్నారు. ఈ సినిమాలో రంగమ్మత్త ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ నెల 30 వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా.. ‘రంగస్థలం’ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను అనసూయ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అనసూయ ఒక పుస్తకాన్ని చదువుతూ.. దర్శకుడు సుకుమార్‌తో మాట్లాడుతున్న ఈ ఫొటోకు ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అంటు కామెంట్ చేసింది. అనసూయ సుకుమార్‌కు చేసిన గురోపదేశం ఏమిటో కానీ, ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Guruvu gariki Rangammatta guropadesam.. 🤪🤩😍#Throwback #WhileShootInProgress#RangasthalamOn30thMarch #Rangammatta pic.twitter.com/YX489t2GO6
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 24, 2018
Comments
Please login to add a commentAdd a comment