సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 1985 నాటి ప్రేమకథగా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభించింది. సినిమాపైనా అంచనాలు హైలెవల్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ అనసూయ సెట్‌లో రామ్‌చరణ్‌తో ఓ అదిరిపోయే సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ఓ అమేజింగ్ సీన్‌ను తెరకెక్కించిన తర్వాత ఈ సెల్ఫీని దిగామని, తన నటనతో రామ్‌చరణ్ మనందరూ గర్వపడేలా చేస్తారని, సినిమా విడుదలయ్యేవరకు ఆగండంటూ అనసూయ ట్వీట్ చేసింది. 'రంగస్థలం' అనసూయ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఏమన్నదంటే..
'రంగస్థలం సెట్స్‌లో నిజంగా చాలామంచి వ్యక్తి అయిన రామ్‌చరణ్‌తో దిగిన సెల్ఫీ మీతో పంచుకుంటున్నాను. అమేజింగ్ సీన్‌ను తెరకెక్కించిన తర్వాత ఈ సెల్ఫీ దిగాం. సినిమా వచ్చేవరకు ఆగండి. చరణ్ మనందరూ గర్వపడేలా చేస్తారు' అని అనసూయ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అనసూయ కొడుకు కూడా ఉన్నాడు.
And let me make your day by sharing this much anticipated selfie of mine with this truly immensely good of a person #RamCharan from the sets of #Rangasthalam after an ammaazzzing scene’s shoot!!Just wait till the film’s out!! He will make us all so so proud!!❤️#withMyboy ❤️ pic.twitter.com/dDDURXIYLy
— Anasuya Bharadwaj (@anusuyakhasba) 24 December 2017
Comments
Please login to add a commentAdd a comment